శ్రీ దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రిగారు.


శ్రీ దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రిగారు.దేవులపల్లిసోదరకవులలో యొకరు.రెండవవారు తమ్మనశాస్త్రులవారు.1879 వ సంవత్సరం నివంబరు నెల పిఠాపురసంస్శ్చానాధీశుడు శ్రీగంగాధరరామరాయ మహారాజుగారి యాస్థానం కవిపండితులతో కిటకట లాడుతోంది.కారణం శతావధాని,భరతాభ్యుదయ ప్రబంధకర్త విద్వాన్ శ్రీ మాడభూషి వేంకటాచార్యులవారు,శతావధానము
చేయుటకు విచ్చేసినారు.అపూర్వ శతావదాన ప్రక్రియ.అవధాననైపుణ్యము,అసాధారణ ధారణకు రాజావారబ్బురపడి వారిని తగురీతి సమ్మానించి యిట్లనిరి:-సభ్యులారా!మనయాస్థానంబున నేతాదృక్షవిచక్షణులెవ్వరేని నివ్వటిల్లుదురే? యని ప్రశ్నించిరి.అప్పుడు యొక సభ్యుడు లేచి దేవా!దేవర సంస్థానిక విద్వాంసులగు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రులుగారు,వారి కుమారులు యిరువురు కూడా అవధానంబునకు సమర్ధులని విన్నవించిరి. కాని వారికి దేవులప్లలి వారి కవితా శక్తి మాత్రమే తెలియును కాని వారిధారణశక్తిగాని,మేధా శక్తిగాని ఇంతవరకు ప్రకటితము కాలేదు.వెంటనే రాజావారు చంద్రంపాలెంనుండి దేవులపల్లివారిని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించిరి.ఈ ఇరువది యారేళ్ల యువకులైన సుబ్బరాయశాస్త్రిగారికి ఇది క్రొత్తగానుండుటచే మరునాడు అవధానము చేయుటకంగీకరించిరి. మరునాడవదధానమునకు హాజరైన శ్రీమాడభూషివారు శ్రీ శాస్త్త్రిగారి అద్బుత కవితా శక్తి,అసాధారణధారణా శక్తిని గాంచి ముగ్ధులై మహారాజు గారితో నిట్లనిరి.వీరిపద్యములన్నియు ప్రబంధముల వలె భాసించుచున్నవిగాని ఆశువుగా చెప్పినట్లుగనబడుటలేదు.అందు యొక పద్యం చిత్తగించండి అని ఇది అవధానములలో ఆంధ్రీకరించమని పచ్ఛకులడిగిన ప్రశ్నయని యట్లు పృఛ్చకులడుగరాదని అయినను శాస్త్రిగారు ఆశువుగా ఆంధ్రీకరించిరనియు తెల్పిరి.ఆపద్యం ఇది:

చ.జముకొడుకీదుపట్టియును జన్నపుటోరెపు ఱేనికందు దూ ర్పుమనియగానివెజ్జులకుబుట్టినవారునుబావగార్లుఱేం డ్లుమఱఁదులౌదురైదుగురిలోఁగడుఁజిన్నతఁడెన్బావగాఁ డుమఱఁదిగాడుపెద్దయతడుందగఁద్రోవదికెంచిచూచినన్.

దీనికి మూలమగు సంస్కతశ్లోకము కాళిదాసు చాటువు: .

శ్లో.ద్రౌపద్యాఃపాండుతనయాఃపతిదేవరభావుకాః న దేవరో ధర్మరాజః స్సహదేవో న భావుకః
Courtesy:- Lakshminarayana Murthy Ganti

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!